Header Banner

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

  Fri May 16, 2025 10:07        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మెగా డీఎస్సీ చర్చ నీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఏకంగా 16,347 ఉపాధ్యాయ కొలువుల జారీకి సంతకం చేసింది. అయితే ఆ తర్వాత తెరమీదకు వచ్చిన ఎస్సీ వర్గీకరణ కారణంగా వాయిదా పడగా.. గత నెల 20వ తేదీన డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే దాదాపు ఏడేళ్ల పోరాడం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో తొలిసారి డీఎస్సీ నియామకాలు జరుగుతున్నాయని.. కనీసం నిరుద్యోగుల విన్నపాలను సర్కార్‌ ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తు గడువు పొడిగించాలని, ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాలని వస్తున్న అభ్యర్ధనలను కూటమి సర్కార్‌ పెడచెవిన పెడుతుంది.

నిజానికి, మెగా డీఎస్సీ ప్రకటన చేసినప్పటి నుంచి నిరుద్యోగుల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది. కానీ దీనిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమంలో 90 రోజుల పాటు డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం కావాలని వస్తున్న అభ్యర్ధనలపై మంత్రి లోకేష్‌ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. మెగా డీఎస్సీని ఆపడానికి వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కొంత మంది ప్రిపరేషన్‌కు సమయం పెంచాలని కోరుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

అయితే సిలబస్‌ను డిసెంబర్ నెలలోనే ఇచ్చేసామని, అప్పటి నుంచి చూస్తే దాదాపు ఇప్పటి వరకు గడువు ఏడు నెలలు పూర్తయిందని అన్నారు. దీనిని బట్టి చూస్తే ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు లేనట్లేనని స్పష్టమైంది. అలాగే జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలు యథాతథంగా జరగబోతున్నట్లు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు తేల్చేశాయి. దీంతో గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. ఉన్న సమయంలోనే సిలబస్‌ ఎలా పూర్తి చేయాలో తెలియక ఒత్తిడికి గురవుతున్నారు.

కాగా గురువారం అనంతపురం జిల్లాకు వచ్చిన మంత్రి లోకేష్.. గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే సందర్భంలో డీఎస్సీ 2025పై మంత్రి లోకేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #MegaDSC2025 #DSCDeadline #MinisterLokesh #TeacherJobs #APJobs #DSCUpdate #DSCAspirants